ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మదనపల్లె మండలం బార్లపల్లెలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. క్షత గాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి మార్గ మధ్యంలో మరో ముగ్గురు మరణించారు . మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనలో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా వాహనాదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు వాహనాలు అతివేగంగా నడపొద్దన్నారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు. రోడ్డు సేఫ్టీ రూల్స్ కచ్చితంగా పాటించాలన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.