అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

హైదరాబాద్ , వెలుగు: ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పగిలి అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం– -కడప హైవేపై శింగమనల మండలం నాయినపల్లి క్రాస్ రోడ్ వద్ద  ఈ ఘటన చోటు చేసుకున్నది.  వీరంతా తాడిపత్రిలో నగర కీర్తన వేడుకల్లో పాల్గొని, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురానికి చెందినవారే. వారిని సంతోష్, షణ్ముక్ , వెంకన్న , శ్రీధర్, ప్రసన్న, వెంకీగా పోలీసులు గుర్తించారు. అతివేగమే యాక్సిడెంట్ కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.