శేఖ్ అలీ, చిన్న మనువడు శేక్ ఇజాన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయారు. శేఖ్ అర్హాన్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఇంటికి వస్తున్నామని ఫోన్లో తల్లికి చెప్పిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అలీ కొడుకు శేక్ నౌసీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని టీచర్..
కొత్తగూడ(గంగారం), వెలుగు: డ్యూటీకి వెళ్తుండగా, బైక్‌ను వెనక నుంచి లారీ ఢీకొనడంతో టీచర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన సండ్ర ఉపేందర్(45) ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో టీచర్ ఉద్యోగం పొందాడు. గంగారం మండలం పుల్సంవారి గుంపు ప్రైమరీ స్కూల్లో డ్యూటీ చేస్తున్నాడు.
సోమవారం ఉదయం బైక్‌పై స్కూల్‌కు వెళ్తుండగా, బావురుగొండ క్రాస్ రోడ్ మూల మలుపు వద్ద వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్ గమనించకుండా మర్రిగూడెం వెళ్లగా, అక్కడికి సమాచారం ఇవ్వడంతో స్థానికులు లారీని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదిలాఉంటే పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ కష్టపడి చదువుకొని, ఉద్యోగం సాధించిన ఉపేందర్ మొదటి నెల జీతం తీసుకోకుండానే చనిపోయాడడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న భార్య స్వప్న, కొడుకు ప్రేమ్‌తేజ్, కూతురు శాన్విత దిగ్ర్భాంతికి గురయ్యారు. ప్రమాదంలో చనిపోయిన టీచర్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గంగారంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.