స్టేట్ స్కేటింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక

గద్వాల, వెలుగు : స్టేట్ లెవెల్ స్కేటింగ్ పోటీలకు ధరూర్ మండలంలోని మిర్జాపురం గ్రామానికి చెందిన రితిక్ అభిమన్యు రెడ్డి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెలలో స్టేట్ లెవెల్ స్కేటింగ్ పోటీలు హైదరాబాద్‌‌లో ఉంటాయన్నారు. గత నెల 8, 9 తేదీలలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్కేటింగ్ పోటీలు నిర్వహించగా అందులో మహబూబ్‌‌ నగర్ జిల్లా తరఫున రితిక్ అభిమన్యు రెడ్డి అండర్-10లోని మూడు విభాగాల్లో ఒక గోల్డ్ రెండు సిల్వర్ మెడల్స్ సాధించి స్టేట్ లెవల్ కు అర్హత సాధించాడని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.