
హైదరాబాద్, వెలుగు : ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ –జె100 టోర్నమెంట్‌లో హైదరాబాద్ యంగ్‌స్టర్ రిషిత రెడ్డి గర్ల్స్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో రిషిత 4–6, 6–4, 6–3తో రష్యాకు చెందిన నెల్లి ఇవనోవాపై మూడు సెట్ల పాటు పోరాడి ఉత్కంఠ విజయం సాధించింది. గత వారం గువాహతిలో జె60 టోర్నీలో విజేతగా నిలిచిన రిషిత వరుసగా రెండో ఐటీఎఫ్ జూనియర్ టైటిల్ గెలిచింది.