ఉత్తరాఖండ్ రిషికేశ్‌లోని తాజ్ హోటల్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 76 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ హోటల్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. హోటల్‌ను పూర్తిగా శానిటైజ్ చేశారు. గత గురువారం హోటల్‌లో 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అలర్టైన యాజమాన్యం అందరికీ నిర్ధారణ పరీక్షలు చేయించింది. ఇందులో అందరికీ కరోనా సోకినట్లు తేలింది.
మరోవైపు ఏప్రిల్1 నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. దీంతో అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం...కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది.
