ఐసీసీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో..పంత్‌‌‌‌‌‌‌‌ @ 6

దుబాయ్‌‌‌‌‌‌‌‌ : టీమిండియా వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ రిషబ్ పంత్‌‌‌‌‌‌‌‌.. ఐసీసీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–10లోకి దూసుకొచ్చాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను 731 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ చేయడంతో పంత్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగైంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (751) ఒక్క స్థానం  మెరుగుపడి ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (716), విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (709) చెరో ఐదు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు దిగజారి వరుసగా 10, 12వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లకు పడిపోయారు.

 శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (701) ఐదు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 14వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. జో రూట్‌‌‌‌‌‌‌‌ (852), విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (852), డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (760), స్మిత్‌‌‌‌‌‌‌‌ (757) టాప్‌‌‌‌‌‌‌‌–4లో ఉన్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అశ్విన్‌‌‌‌‌‌‌‌ (871), బుమ్రా (854) టాప్‌‌‌‌‌‌‌‌–2లోనే కొనసాగుతున్నారు. జడేజా (804) ఆరో స్థానానికి ఎగబాకగా, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (679) 16వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.