T20 World Cup final 2024: కావాలనే యాక్టింగ్ చేశాను.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌పై పంత్

టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో భారత్ అద్భుతం చేసింది. ఓడిపోయే మ్యాచ్ లో అసాధారణంగా పోరాడి విజయం సాధించారు. దీంతో 2007 తర్వాత మరోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచారు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో భారత పేస్ త్రయం బుమ్రా, హార్దిక్, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బుమ్రా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగా.. హార్దిక్ కీలక వికెట్లు పడగొట్టి సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచాడు. అయితే, వీరితో పాటు టీమిండియా విజయానికి మరో పరోక్ష కారణం ఉంది.

వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తెలివితేటలు భారత్ కు కప్ అందించడంలో సహాయం చేశాయి. క్లాసెన్, మిల్లర్ మ్యాచ్ ముగించేలా ఉన్న సమయంలో గాయం సాకుతో పంత్ సమయాన్ని వృథా చేశాడు. ఇలా చేయడం టీమిండియాకు అనుకూలంగా మారింది. ఆ నాలుగైదు నిమిషాలలో క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయాడు తెలిపాడు. ఈ విషయంపై పంత్ స్పందించాడు.

ALSO READ : IPL 2025: నేను ఇప్పటివరకు అలా చేయలేదు: ఫారెన్ ప్లేయర్ రూల్‌పై కమ్మిన్స్

" ఆ సమయంలో చిన్న విరామం కావాలని ఫిజియోని అడిగాను. ఇంతలో రోహిత్ భయ్యా నా దగ్గరకు వచ్చి మోకాలు ఎలా ఉంది అని అడిగాడు. నేను రోహిత్ తో నాకు బాగానే ఉంది. యాక్టింగ్ చేస్తున్నాని చెప్పాను. కొన్నిసార్లు ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. ప్రతీసారి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందని చెప్పలేం. కానీ చేసిన పని జట్టుకు కలిసి వచ్చింది". అని పంత్ అన్నాడు.