ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లోకి పంత్ రానున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ను రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జట్టులో ఉండడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో అతడిని వదిలేసుకొని నలుగురు రిటైన్ ప్లేయర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ 2025 మెగా ఆక్షన్ లోకి పాల్గొననుంది. కెప్టెన్, వికెట్ కీపర్ గా సూపర్ ఫామ్ లో ఉన్న పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని భావించినా అది జరగలేదు. ఈ విషయం షాకింగ్ కు గురి చేసింది.
పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు రిటైన్ చేసుకోలేదో ఇప్పటికీ కారణం తెలియలేదు. అతను ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ యాజమాన్యం అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదని నివేదికలు చెప్పుకొచ్చాయి. ఈ ఊహాగానాలకు తాజాగా పంత్ చెక్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని తన ఎక్స్ లో తెలిపాడు. అయితే అసలు కారణం ఏంటనే విషయాన్ని పంత్ తెలుపలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు పంత్ కు మధ్య జరిగిన విభేదాలు ఏంటనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది.
Rishabh Pant breaks his silence on parting ways with Delhi Capitals! ❌
— Sportskeeda (@Sportskeeda) November 19, 2024
Where next for the Indian keeper-batter? ?#Cricket #RishabhPant #Delhi #IPL pic.twitter.com/bu3L2qmBhA
నవంబర్ 24,25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో పంత్ భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తుంది. భారత ఆటగాడు.. వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్.. కావడంతో పంత్ ఈ మెగా ఆక్షన్ లో అందరికంటే ఎక్కువ ధర పలుకుతాడని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ విషయానికి వస్తే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు రూ. 16.50 కోట్లు, కుల్దీప్ యాదవ్ రూ. 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ కు రూ. 10 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు.
అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అభిషేక్ పోరెల్ కు నాలుగు కోట్లు దక్కాయి. నలుగురు ప్లేయర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 47 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వారు రూ. 73 కోట్లతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టబోతున్నారు. రిషబ్ పంత్ తో పాటు డేవిడ్ వార్నర్, అన్రిచ్ నార్ట్జే లాంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది.RTM కార్డు ఉపయోగించి ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్,ఒక క్యాప్డ్ ప్లేయర్ ను తీసుకోవచ్చు. లేకపోతే ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్‌లను అయినా తీసుకోవచ్చు.
The curious case of Rishabh Pant & Delhi! ?
— Star Sports (@StarSportsIndia) November 19, 2024
? Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!
? Watch #IPLAuction ? NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96