IPL Auction 2025: నిమిషాల్లో అయ్యర్ ఆల్‌టైం రికార్డ్ బ్రేక్ .. ఐపీఎల్ చరిత్రలోనే పంత్‌కు అత్యధిక ధర

ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్ కు కనీ వినీ ఎరుగని ధర లభించింది. వేలానికి ముందు ఖచ్చితంగా భారీ ధర పలుకుతాడని ఆశించిన అతనిపై కోట్ల వర్షం కురిసింది. రూ. 27 కోట్ల రూపాయలకు రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. ఇదే వేలంలో కొద్దిసేపటి క్రితం శ్రేయాస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఈ రికార్డును పంత్ నిమిషాల్లో బ్రేక్  మారింది.        

పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 2025 మెగా ఆక్షన్ కు ముందు రిలీజ్ చేశారు. దీంతో పంత్ కోసం కొన్ని జట్లు పోటీ పడుతూ వచ్చాయి. పంత్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్ తెగ ఆసక్తి చూపించాయి. రూ. 20 కోట్ల దగ్గర ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను తీసుకోవడానికి RTM కార్డు ను ఉపయోగించింది. ఈ దశలో లక్నో సూపర్ జయింట్స్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలు చెలిస్తామని ముందుకొచ్చింది. దీంతో దిలీప్ క్యాపిటల్స్ RTM కార్డు ఆశలు ఆవిరయ్యాయి.