Rinku Singh: ఐపీఎల్‌లో జాక్ పాట్.. కొత్త ఇల్లు కొన్న భారత క్రికెటర్

టీమిండియా బ్యాటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన సొంత నగరంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. తన డ్రీం హౌస్ ని  అలీఘర్‌లో కొనుగోలు చేసినట్టు సమాచారం. రింకు కొత్త ఇల్లు కోఠి నెం. 38 ఓజోన్ సిటీలోని గోల్డెన్ ఎస్టేట్‌లో ఉంది. 500 చదరపు గజాలలో ఈ ఇల్లు ఉందట. తన కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. సాంప్రదాయ పూజతో గృహప్రవేశ కార్యక్రమం కూడా జరిగిందట. ఐపీఎల్ లో రింకూ సింగ్ 2025 కి గాను ఏకంగా 25 రెట్లు పెరిగింది. అతన్ని కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 13 కోట్ల  రూపాయలకు రిటైన్ చేసుకుంది. 

2023 ఐపీఎల్ సీజన్ లో రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్ ఆటగాడి లిస్టులోకి చేరాడు. ఏప్రిల్ 09, 2023న (ఆదివారం) గుజరాత్‌ టైటాన్స్‌పై  జరిగిన మ్యాచ్ లో రింకూ సృష్టించిన విధ్వంసం అలాంటింది.  ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా జట్టును గెలిపించి ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయాడు. ఈ ప్రదర్శనతో అనూహ్యంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి తనకు తాను నిరూపించుకున్నాడు. నిలకడగా ఆడుతూనే వేగంగా పరుగులు చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

బాగా ఆడినా 2024 లో రింకూ సింగ్ కు రూ. 55 లక్షల రూపాయలతో కేకేఆర్ యాజమాన్యం అతన్ని కొనసాగించింది. అయితే 2025 ఐపీఎల్ కు గాను రింకూకు రూ. 13 కోట్ల రూపాయలు అందుకోనున్నాడు. 2018లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రింకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత ఐదేళ్ల పాటు అదే టీమ్ తరుపున ఆడుతూ వస్తున్నాడు. 20222 ఐపీఎల్ లోగాయం కారణంగా అతను ఆడలేకపోయాడు. 2023 ఐపీఎల్ కు ముందు జరిగిన వేలంలో 55 లక్షలకు కొనుగోలు చేసి తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయక కోచ్‌ అభిషేక్ నాయర్‌ మార్గదర్శకంలో రింకు సింగ్‌ రాటుదేలాడు.