ENG v AUS 2024: ఒక్కరికీ 1000 పరుగులు లేవు.. ఇంగ్లాండ్ టాప్ స్కోరర్‌గా బౌలర్ రషీద్

ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు బలమైన జట్టుతో బరిలోకి దిగాలి. కానీ ఇంగ్లాండ్ మాత్రం దీనికి భిన్నం. ప్రస్తుతం సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్ లో వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ పోయే పరిస్థితిలో నిలిచింది. దీనికి కారణం జట్టులో అనుభవం లేకపోవడమే అని స్పష్టంగా తెలుస్తుంది. జట్టంతా కుర్రాళ్లతో నిండిపోయింది. ఇంగ్లీష్ జట్టులో ఒక్కరు కూడా 1000 పరుగులు చేయకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

874 పరుగులు చేసిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రస్తుతం ఇంగ్లాండ్ వన్దే జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా కొత్త కెప్టెన్ హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. తమ జట్టులో అనుభవం లేకపోవడమే కూటములకు కారణమని.. ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్ జట్టులో టాప్ స్కోరర్ అని గుర్తు చేశాడు. యంగ్ ప్లేయర్స్ సాల్ట్, జాక్స్, డకెట్, బ్రూక్, జెమీ స్మిత్ , లివింగ్ స్టోన్ వన్డేల్లో 1000 పరుగులు చేయలేదు. 

స్టాండ్ ఇన్ కెప్టెన్ బట్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. బెయిర్ స్టో, రాయ్ ఇంగ్లాండ్ జట్టులో ఎంపిక కాలేదు. మొయిన్ అలీ, స్టోక్స్ ఇప్పటికే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొత్తం అనుభవం లేదు. తొలి వన్డేలో భారీ స్కోర్ చేసినా బౌలర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో వన్డేల్లో బ్యాటర్లు విఫలం కావడంతో  63 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓడిపోయింది.