Duleep Trophy 2024: అదరగొట్టిన ఆంధ్రా కుర్రాడు.. దులీప్ ట్రోఫీ టాప్ స్కోరర్‌గా రికీ భుయ్

దేశంలో టాప్ ప్లేయర్లు ఆడే దులీప్ ట్రోఫీలో ఆంధ్రా కుర్రాడు రికీ భుయ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా డి తరపున ఈ సీజన్ లో మొత్తం 71 యావరేజ్ తో 6 ఇన్నింగ్స్ లో 359 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. వారందరిని దాటి రికీ టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. అంతేకాదు చివరి మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను అవార్డును గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా బి పై తొలి ఇన్నింగ్స్ లో 56 పరుగులు చేసిన ఈ ఆంధ్రా కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్ లో 119 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.   

ఇతను పుట్టింది మధ్య ప్రదేశ్ లోనైనా చదువుకుంది మాత్రం వైజాగ్ లోనే. ఆంధ్ర తరపున రంజీ లీగ్ లు ఆడుతూ ఎన్నో సార్లు టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఐపీఎల్ లోనూ సన్ రైజర్స్ తరపున ఆడాడు. రంజీ సీజన్ లోనూ రికీ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఆంధ్రప్రదేశ్ తరపున 13 ఇన్నింగ్స్‌లలో 75.16 సగటుతో 902 పరుగులు చేశాడు. 2013లో దేశవాళీ క్రికెట్ లో అడుగుపెట్టిన ఈ 27 ఏళ్ళ కుర్రాడు ఇండియా అండర్ 19, ఆంధ్రా, సన్‌రైజర్స్ హైదరాబాద్, సౌత్ జోన్, ఇండియా A, బోర్డ్ ప్రెసిడెంట్స్ XI, ఇండియా B, ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI, ఇండియా బ్లూ జట్ల తరపున ఆడాడు. 

ALSO READ | AFG vs SA 2024: బ్యాడ్ లక్ అంటే ఇతనిదే.. విచిత్రకర రీతిలో ఆఫ్గన్ బ్యాటర్ రనౌట్

ఈ టోర్నీ విషయానికి వస్తే ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో రాణించిన ఇండియా–ఎ జట్టు దులీప్‌‌‌‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లో రెండు విజయాలతో 12 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. ఇండియా–సితో ఆదివారం ముగిసిన మూడో మ్యాచ్‌‌‌‌లోనూ 132 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. 350 రన్స్‌‌‌‌ ఛేజింగ్‌లో సాయి సుదర్శన్‌‌‌‌ (111) సెంచరీతో చెలరేగినా.. ఇండియా–-సి  81.5 ఓవర్లలో 217 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. రుతురాజ్‌‌‌‌ (44) పోరాడినా విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ (17), ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (17) నిరాశపర్చారు. శాశ్వత్‌‌‌‌ రావత్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.