అంతా ఉత్తుత్తినే: పవన్ కళ్యాణ్ పై పోటీ చెయ్యట్లేదు - ఆర్జీవీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయనున్నాడన్న అంశంపై సస్పెన్స్ కి తెరపడింది. పిఠాపురం నుండి పోటీ చేయనున్నట్లు తానే స్వయంగా ప్రకటించటంతో జనసైనికుల సుదీర్ఘకాల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉండగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నా అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాను ఊపేసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన కొద్దిసేపటికే వర్మ ఈ ట్వీట్ చేయటం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

తాజాగా వర్మ మరో సంచలన ట్వీట్ చేశాడు. తాను పవన్ కళ్యాణ్ పై పోటీ చేయట్లేదని, అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని ట్వీట్ చేశాడు. పిఠాపురం నేపథ్యంలో తాను తీసిన ఒక షార్ట్ ఫిలిమ్ తో ఒక కాంటెస్ట్ కి పోటీ చేస్తున్నానని ట్వీట్ చేశారు. సడన్ డెసిషన్ అన్నాను తప్ప, ఎన్నికలు అన్న పదం ఎక్కడ వాడలేదానిన్ క్లారిటీ ఇచ్చాడు. అందరూ ముందుగా ఊహించినట్లే పవన్ ని టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్ చేశాడని తేలింది. మొత్తానికి ఒక్క ట్వీట్ తో వర్మ రేపిన దుమారం 24గంటలు గడవకముందే చల్లారింది.