ఎన్నికల బరిలో ఆర్జీవీ, పవన్ కళ్యాణ్ పై పోటీ..

ఇప్పటికే ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు తన వంతుగా మరో బాంబు పేల్చాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్వయంగా ప్రకటించాడు. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోటీగా పిఠాపురం నుండి బరిలో దిగుతానని ప్రకటించి షాక్ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన కొద్దిసేపటికే తాను కూడా పిఠాపురం బరిలో దిగుతానంటూ ఆర్జీవీ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సడన్ గా తీసుకున్న నిర్ణయం.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు వర్మ. అయితే, ఆర్జీవీ ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఈ ట్వీట్ చేశాడా లేక నిజంగానే పోటీకి దిగుతున్నాడా అన్న చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. రోజురోజుకీ సీరియస్ గా మారుతున్న ఏపీ పాలిటిక్స్ లో ఆర్జీవీ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడని చెప్పచ్చు.