- ఒకరికి 9 కంటే ఎక్కువ సిమ్‌లుంటే రీ–వెరిఫై చేయాల్సిందే!
- టెలికం కంపెనీలకు డాట్ ఆర్డర్స్
న్యూఢిల్లీ: సబ్‌స్క్రయిబర్‌కు తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కనెక్షన్లు ఉంటే వాటిని రీ–వెరిఫై చేయాలని టెలికం కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లేకపోతే ఈ కనెక్షన్లను డీ–యాక్టివేట్ చేస్తారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) ఆదేశించింది. జమ్మూ, కాశ్మీర్, నార్త్ ఈస్ట్, అస్సాంలకు చెందిన సబ్‌స్క్రయిబర్ల విషయంలో ఆరు కనెక్షన్లకు మించి ఉంటే రీ–వెరిఫై తప్పనిసరి. ఏ సిమ్ కార్డు కొనసాగించాలో ఎంచుకునే అవకాశాన్ని సబ్‌స్క్రయిబర్‌కు ఇస్తారు. మిగిలిన కనెక్షన్లను డీయాక్టివేట్ చేస్తారు. ఫైనాన్షియల్ క్రైమ్స్, ఇబ్బందికరమైన కాల్స్, ఆటోమేటెడ్ కాల్స్, ఫ్రాడ్ యాక్టివిటీస్ పెరగడంతో డాట్ ఈ నిర్ణయం తీసుకుంది. రూల్స్ ప్రకార వాడకంలో లేని మొబైల్ కనెక్షన్లను కంపెనీలు తమ డేటా బేస్ నుంచి తొలగిస్తాయి. తొమ్మిది కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్న సబ్‌స్క్రయిబర్ల సిమ్ కార్డుల అవుట్ గోయింగ్ కాల్స్(డేటా సర్వీస్‌లు కూడా)ను 30 రోజుల్లో నిలిపేస్తారు. ఇన్‌కమింగ్ సర్వీస్‌లను 45 రోజుల్లో సస్పండ్ చేస్తారు.
