హైదరాబాద్, వెలుగు: కరోనా దెబ్బతో తీవ్రంగా నష్టపోతున్న తమకు బ్యాంకుల నుంచి పెద్దగా సాయం అందడం లేదని ఇండియన్ రిటైలర్స్ వాపోతున్నారు. తిరిగి తమ వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకోవాలంటే ఆర్థికంగా సాయమవసరమని, కానీ బ్యాంకుల మద్దతు మాత్రం అంతంత మాత్రంగానే ఉందని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. రిటైలర్స్‌అసోసియేషన్‌ఆఫ్‌ఇండియా నిర్వహించిన ఈ సర్వేలో 300 మంది రిటైలర్లు పాల్గొన్నారు. కరోనా ప్రభావం నుంచి బయటపడటానికి బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం అంతంతమాత్రంగానే ఉందని ఈ సర్వే పేర్కొంది. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే రిటైల్‌ఇండస్ట్రీకి ఎక్కువ మద్ధతు లభిస్తోందని తెలిపింది. కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు చిన్న వ్యాపారాలకు అదనంగా అప్పులివ్వాలని ఇండియన్‌బ్యాంకులను ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ బ్యాంకుల నుంచి సహకారం పెద్దగా లభించడం లేదని ఈ సర్వే చెబుతోంది. సర్వేలో పాల్గొన్న రిటైలర్లలో ప్రభుత్వ బ్యాంకులు అందిస్తున్న ఫైనాన్షియల్‌సపోర్ట్‌కు 52 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు. కానీ ఇంతే మొత్తంలో ప్రైవేట్‌బ్యాంకుల సహకారంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదనపు వర్కింగ్‌క్యాపిటల్‌లోన్లను ఇవ్వడానికి ప్రైవేట్‌బ్యాంకులు విముఖంగా ఉన్నాయని ఈ సర్వే పేర్కొంది.
ఇండియన్‌ఎకోసిస్టమ్‌లో రిటైలర్లు తొందరగా సాధారణ స్థాయికి చేరుకోగలరని రిటైలర్‌అసోసియేషన్‌సీఈఓ కుమార్‌రాజగోపాలన్‌అన్నారు. కరోనా దెబ్బతో ఎసెన్షియల్‌ఐటెమ్స్‌అమ్మకాలు 40 శాతం పడిపోయాయని, నాన్–ఎసెన్షియల్‌అమ్మకాలు 100 శాతం తగ్గాయని చెప్పారు. ఆదాయాలు పడిపోవడంతో చాలా వరకు రిటైలర్లు తమ వ్యాపారాలను మూసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మరికొందరు తమ ఉద్యోగులకు జీతాలను కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. ప్రైవేట్‌బ్యాంకుల వైఖరి, రిటైల్‌ఇండస్ట్రీతో పాటు బ్యాంకులకూ నష్టాన్ని మిగులుస్తుందని రాజగోపాలన్‌చెప్పారు. ఇప్పటికే ఇండియన్‌బ్యాంకులు రిటైల్‌సెక్టార్లో భారీగా పెట్టుబడులు పెట్టాయని, ఈ సెక్టార్‌తిరిగి నిలదొక్కుకోలేకపోతే ఈ పెట్టుబడుల్లో చాలా భాగం మొండి బాకీలుగా మారతాయని పేర్కొన్నారు. తాజాగా ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్‌పాయింట్లు తగ్గించింది. అంతేకాకుండా ఈఎంఐలపై మూడు నెలల మారటోరియాన్ని ఇచ్చింది. ఈ మారటోరియం కూడా సగానికిపైగా రిటైలర్లు పొందలేకపోయారని ఈ సర్వే పేర్కొంది. అదనపు వర్కింగ్‌క్యాపిటల్(కోవిడ్19 లిమిట్) లిమిట్‌ను కోరినప్పటికి ఈ లిమిట్‌లో కేవలం 15 శాతం మాత్రమే పొందామని 54 శాతం రెస్పాండెంట్లు అన్నారు. ప్రభుత్వ బ్యాంకులు 28 శాతం లోన్‌రిక్వెస్ట్‌లను తిరస్కరించాయని చెప్పారు. ప్రైవేట్‌బ్యాంక్‌లయితే కేవలం 10 శాతం రిక్వెస్ట్‌లకే లోన్స్‌ను మంజూరు చేశాయని అన్నారు.
సర్వేలోని ముఖ్యాంశాలు
- అదనపు వర్కింగ్‌క్యాపిటల్‌లిమిట్‌లో 2.3 శాతం – 40 శాతం బ్యాంకులు ఇస్తున్నాయి. అంటే సగటున 13 శాతం అమౌంట్‌నే అప్పుగా ఇస్తున్నాయి.
- లోన్‌ను ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులకు 21 రోజులు పడుతోంది. ప్రైవేట్‌బ్యాంకులకైతే 35 రోజులు పడుతోంది.
- ప్రైవేట్‌బ్యాంకులపై 54 శాతం మంది రెస్పాండెంట్లు అసంతృప్తిగా ఉన్నారు. 24 శాతం మంది న్యూట్రల్‌గా,25 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు.
- 28 శాతం ప్రభుత్వ బ్యాంకులపై అసంతృప్తిగా ఉంటే, 20 శాతం న్యూట్రల్‌గా, 52 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు.
