అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం
తిరువనంతపురం: కేంద్రం తీసుకొచ్చిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ మూడు చట్టాలు రైతులకు నష్టం కలిగిస్తున్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గురువారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీపీఐ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈ తీర్మాన్నాన్ని సమర్థించాయి. కేరళ అసెంబ్లీలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ తీర్మానంలోని కొన్ని అంశాలపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్మానానికి మద్దతు పలికారు. “సభలో తీర్మానంపై ఏకాభిప్రాయం ఉంది. అందుకే నేను వ్యతిరేకించలేదు” అని రాజ్‌గోపాల్ మీడియాతో చెప్పారు.
For More News..
రేపు అన్ని సిటీల్లో వ్యాక్సిన్ డ్రై రన్
న్యూ ఇయర్‌కు వ్యాక్సిన్‌తో వెల్‌కమ్!
ఓటుకు నోటు కేసులో చంద్రబాబే డీల్ చేసిండు
