టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆఫ్ సీజన్లో ఐదు డ్యామ్‌లు నిండాయి, . పూర్తిస్థాయిలో జలాశయాలు నిండటంతో నీటి నిల్వలతో డ్యామ్‌లు కళకళలాడనున్నాయి. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుమలలో ఐదు జలాశయాలు నిర్మించింది. భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో అందుకనుగుణంగా నీటి వాడకం పెరుగుతూ రావడంతో నిల్వలకోసం టీటీడీ డ్యామ్‌లను నిర్మిస్తూ వచ్చింది. మొదటి డ్యామ్ గోగర్భం డ్యాం కు పూర్తి స్థాయిలో నీళ్ళు చేరుకోవడంతో మరీ కాసేపట్లో ( వార్త రాసే సమయానికి) గేట్లు ఎత్తి నీరును లోతట్టు ప్రాంతానికి విడుదల చేయడానికి టీటీడీ వాటర్ వర్క్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గోగర్భం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 2894 అడుగులకు గాను 2887 అడుగులకు మేర నీళ్ళు చేరుకోవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తర్వాత చిన్నదైన ఆకాశగంగ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 865 మీటర్లకు గాను 859.80 మీటర్ల మేర నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పాపవినాశనం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 697.14 మీటర్లు కాగా ఇప్పటికే 693.60 మీటర్లకు నీరు చేరుకుంది. ఇక జంట ప్రాజెక్టులైన కుమార దారా డ్యాం పూర్తి సామర్థ్యం 898.24 మీటర్లు కాగా 896.20 వరద నీరు చేరుకుంది. పసుపు దారా డ్యాం సామర్థ్యం 898.28 కు గాను ఇప్పటికీ 895.90 మీటర్లకు మేరకు నీరు చేరింది.
తిరుమలలో ఐదు డ్యాంలు ఒకేసారి నిండాయి.. అధికారులు అప్రమత్తం
- ఆంధ్రప్రదేశ్
- December 4, 2023
మరిన్ని వార్తలు
-
Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
-
Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
-
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
-
పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.