పిల్లులు పచ్చగడ్డి ఎందుకు తింటాయో తెలిసిందోచ్!

పిల్లులు పచ్చగడ్డి ఎందుకు తింటాయో తెలిసిందోచ్!

గుట్టు విప్పిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా  సైంటిస్టులు

పిల్లులు ఏం తింటాయి? ఎలుకల్ని తింటాయి. దొరక్కపోతే మన ఇండ్లల్ల పాలు తాగుతాయి. కొన్నిసార్లు ఏమీ దొరక్కపోతే అన్నం వంటివి తినీ కడుపు నింపుకొం టాయి. కానీ అవి అప్పుడప్పుడు పచ్చగడ్డికూడా తిం టాయన్నది చాలామందికి తెలియనిముచ్చట. కావాలనే పచ్చగడ్డి తిని వాం తులు కూడాచేసుకుం టాయన్నది వాటికి మాత్రమే తెలిసినటాప్ సీక్రెట్! అయితే, ఈ సీక్రెట్ వెనక ఉన్న అసలుసంగతిని యూనివర్సి టీ ఆఫ్​కాలిఫోర్ని యా సైంటిస్టు-లు కనిపెట్టేశా రు. వీటికి ఈ అలవాటు ఎవల్యూషన్లోభాగంగా వందల ఏండ్ల కిందనే ఏర్పడిందని వారు చెబుతున్నా రు. అందుకే వాటికి సహజంగానే ఈ అలవాటు ఏర్పడిందని అంటున్నారు.

వాంతులు చేసుకునేందుకే గడ్డి తింటాయ్

పిల్లులు అప్పుడప్పుడు వాంతులు చేసుకునేందుకే కావాలని పచ్చగడ్డిని తింటాయని యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ​వెటరినరీ మెడిసిన్ సైంటిస్టులు తేల్చారు. మొత్తం 1021 పిల్లులు, వాటి ఓనర్లపైవీరు స్టడీ నిర్వహించారు. “ప్రాచీన కాలంలో పిల్లులు ఎక్కువగా ఎలుకలనే ఆహారంగా తీసుకునేవి. దాని వల్ల ఎలుకలను తిన్నప్పుడు వాటితోపాటు అనేక రకాల పరాన్నజీవులు కూడా పిల్లుల కడుపుల్లోకి చేరి అనారోగ్యాన్ని కలిగిం చేవి. అందుకే పేగుల్ని క్లీన్చేసుకునేం దుకని అవి బలవంతంగా పచ్చగడ్డి తిని,వాం తులు చేసుకునేలా అలవాటును ఏర్పర్చుకున్నాయి. దీనివల్ల పేగుల్లో జీవక్రియలు శక్తిమంతమై జీర్ణం కాని ఆహారంతో పాటు పరాన్నజీవులూ బయటకిపోతాయి. పరిణామక్రమంలో అవసరం ఉన్నాలేకున్నా ఈ అలవాటు కొనసాగుతోం ది” అని వర్సి టీసైంటిస్టులు వెల్లడించారు. ఇది తెలియక పిల్లులు ఆరోగ్యం బాగాలేక చికాకుతో గడ్డిని తింటున్నాయని చాలామంది భావించేవారని వారు తెలిపారు.

71% పిల్లులు గడ్డి తిన్నయి

సర్వే కాలంలో దాదాపు 71 శాతం పిల్లులు పచ్చగడ్డి-ని తిన్నా యి. వీటిలో 91 శాతం గడ్డి తిన్నా వాం తులుచేసుకోలేదు. వీటిలో 39 శాతం పిల్లులు సహజంగానేపచ్చగడ్డిని తినగా, మిగతావి పెద్ద పిల్లులను చూసితిన్నా యి. ఈరోజుల్లో పిల్లులు గడ్డి తిని, వాం తులు చే-సుకోవాల్సిన అవసరం లేకున్నా ఎవల్యూషన్ ద్వారాఏర్పడిన అలవాటు కొనసాగుతూ వస్తోం దన్నమాట.కుక్కలు కూడా అప్పుడప్పుడు తమ పేగుల్ని క్లీన్ చేసు-కునేం దుకు గడ్డి కరుస్తుం టాయని ఇదే వర్సి టీ సైంటి-స్టులు 2008లో రీసెర్చ్​ చేసి వెల్లడించారు.