IPL 2025: స్టార్క్, వెంకటేష్ అయ్యర్ ఔట్.. కోల్‌కతా రిటైన్ ప్లేయర్స్ వీరే

ఐపీఎల్ లో అత్యంత పాపులర్ జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుని ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలో కేకేఆర్ జట్టు 2024 ఐపీఎల్ సీజన్ లో విజేతగా నిలిచింది. అయితే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఎప్పుడూ లేని విధంగా హైప్ కలిగిస్తుంది. ఏ ప్లేయర్లు మెగా ఆక్షన్ లోకి వస్తారో.. ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటారనే విషయం ఒక కొలిక్కి రావడం లేదు.

తాజాగా వస్తున్న సమాచార ప్రకారం కేకేఆర్ జట్టు రిటైన్ చేసుకునే ప్లేయర్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. నివేదికల ప్రకారం శ్రేయాస్ అయ్యర్ 2025 ఐపీఎల్ కు కెప్టెన్ గా కొనసాగనున్నాడు. అతనితో పాటు రింకూ సింగ్ జట్టులో ఉండడం దాదాపుగా ఖాయం. వెస్టిండీస్ ఆల్ రౌండర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లాంటి మ్యాచ్ విన్నర్లు రిటైన్ చేసుకునే లిస్ట్ లో టాప్ లో ఉన్నారు. ఐదో ప్లేయర్ కోసం ఇంగ్లాండ్ ఓపెనర్ పిల్ సాల్ట్ ను ఎంపిక చేసే అవకాశముంది. 2024 సీజన్ లో సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్ లతో కేకేఆర్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.  

Also Read :- ఇంగ్లాండ్‌ను నిలబెట్టిన బ్రూక్.. తొలి సెంచరీతోనే రికార్డ్

కొన్నేళ్లుగా కేకేఆర్ జట్టులో నిలకడగా రాణిస్తున్న వెంకటేష్ అయ్యర్ కు నిరాశ తప్పకపోవచ్చు. అతన్ని మెగా ఆక్షన్ లోకి వదిలేసే అవకాశముంది. ఐపీఎల్ చరిత్రలోనే రూ. 24.75 కోట్ల రూపాయలతో 2024 లో కేకేఆర్ జట్టులో చేరిన ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ సైతం వేలంలోకి వదిలేస్తున్నట్టు సమాచారం. స్టార్క్ వరల్డ్ క్లాస్ బౌలర్ అయినా.. అతనికి ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి కేకేఆర్ సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. యువ టాలెంటెడ్ ప్లేయర్లు హర్షిత్ రాణా, రఘువంశీ ఈ సారి ఐపీఎల్ మెగా ఆక్షన్ కు రానున్నారు.