రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలీసుల పటిష్ఠ భద్రత 

రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలీసుల పటిష్ఠ భద్రత 

మణిపూర్ లో 12 పోలింగ్ బూత్ లలో రేపు రీ పోలింగ్ జరగనుంది. తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి. ఓటింగ్ సమయంలో, ఓటింగ్  తర్వాత 12 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆయా పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శనివారం రాష్ట్రంలోని 22 నియోజకవర్గాలకు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు ఈ 12 పోలింగ్ బూత్ లలో కూడా రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. రీ పోలింగ్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 

మరిన్ని వార్తల కోసం

 

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ 

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ