- సిటీలో పెరుగుతున్న నయా కల్చర్
- డిఫరెంట్ బైకులు, కార్లపై యూత్ ఇంట్రస్ట్
హైదరాబాద్, వెలుగు: సిటీలో వెహికల్ రెంట్ బిజినెస్ కి ఫుల్ గిరాకీ ఉంటోంది. బైకులు, కార్లను కొనలేని వారు ఈ వెహికల్స్ ని రెంట్ కి తీసుకుని సరదా తీర్చుకుంటుంటే… మరికొం దరు పే అండ్ యూజ్ పద్ధతిలో రోజువారీ పనుల కోసం వాడుతున్నారు. దీంతో రైడర్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ తో వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకులను అందుబాటులో ఉంచుతున్నారు.
గ్యారేజ్ థీమ్ తో..
ఇప్పటికే సిటీలో ఈ తరహా బిజినెస్ లో రాణిస్తున్న నిర్వాహకులు .. ట్రావెలర్లను ఆకట్టుకునేలా గ్యారేజ్ థీమ్ తో లగ్జరీ కార్లు, బైకులను పార్కింగ్ చేసి ఉంచుతున్నారు. రైడ్ కి వెళ్లాలనుకునేవారు డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ ప్రూఫ్ తో ఈ రెంటల్ స్పాట్ దగ్గరికి వస్తే తక్కువ ధరలో ఇష్టమైనన్నీ రోజులు బైకులు, కార్లతో రెంట్కి తీసుకెళ్లవచ్చు. గచ్చిబౌలిలో ‘డ్రైవెన్ కేఫ్’ వెహికల్ రెంట్ స్పాట్ లో మాత్రమే హై ఎండ్ ఫోర్ వీల్(కార్లు)వెహికిల్స్ ఉండగా, బైక్ రెంట్ స్పాట్ లు సిటీలో 10వరకు ఉన్నాయి.
జీపీఎస్ తో ట్రాక్ చేస్తారు
ఇష్టమైన బైకులు, కార్లలో తిరగాలనుకునేవారికి నచ్చినట్లుగా లంబోర్గిని, ఆడి, పోర్స్చే, వోల్వో వంటి లగ్జరీ కార్లు 150కి పైగా ఉన్నాయి. బైకుల్లో డుకాటీ, హ్యార్లీ డేవిడ్ సన్, బేనేలీ, ట్రింఫ్, కేటీఎం, రాయల్ ఎన్ ఫీల్డ్, ఆర్15, ఎఫ్ జెడ్, పల్సర్, ఫ్యాషన్ ప్రో, యాక్టివా రెంట్కి దొరుకుతున్నాయి. కార్లకు గంటకు రూ. 800 నుంచి 10వేల వరకు ఛార్జ్ చేస్తుండగా, బైకు రేటు రూ.200ల నుంచి 1800ల వరకు రేట్లతో డిఫరెంట్ ప్యాకేజీలున్నాయి. మోడ్రన్ జీపీఎస్ డివైజ్ లతో వెహికల్స్ లేటెస్ట్ లోకేషన్ల కోసం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేస్తారు. రెంట్ కి తీసుకెళ్లిన వెహికల్స్ లో వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా ఆన్ లైన్ సాయంతో గుర్తించి దగ్గర్లోని గ్యారేజ్ నుంచి వచ్చి రిపేర్ చేసేలా ఏర్పా ట్లు ఉంటాయి. పూర్తి డాక్యుమెంట్లతో
ఓసారి వెహికల్ రెంట్ స్పాట్ కు వచ్చారంటే కండీషన్ చెక్ చేసి, మినిమమ్ ఫ్యుయల్ నింపి వెహికల్స్ తో రైడ్ కు వెళ్లే వీలు ఉంటుందని వీటి
నిర్వాహకులు చెబుతున్నారు.

వీకెండ్ లో డిమాండ్ ఎక్కువే…
వీకెండ్ లో ఫోర్ వీలర్స్, మిగతా రోజుల్లో టూవీలర్ వెహికల్స్ కి డిమాండ్ ఎక్కు వగా ఉన్నట్టు రెంట్ స్పాట్ నిర్వాహకులు చెబుతున్నారు.
సరదాగా లాంగ్ డ్రైవ్ ల కోసమే వెళ్లేవారు కూడా ఎక్కువగా బైక్ లు, కార్లను రెం ట్ కి తీసుకెళ్తున్నారంటున్నారు. ఇటీవల గ్రూప్ రైడ్స్ కు
యూత్ లో మంచి ఆదరణ వస్తోందని, వీకెండ్ లో ఈ తరహా రైడ్స్ ఎక్కు వగా జరుగుతాయంటున్నారు, హైదరాబాద్ నుంచి బెంగళూరు,
లోనవాలా, అరకు, వైజాగ్ లాం టి టూరిస్ట్ ప్లేస్ లకి వెళ్లే ట్రావెలర్స్ అధికంగా ఉంటారు. నెలవారీగా చూసిన 2 వేలకుపైగా ట్రావెలర్స్ రెంటెండ్
వెహికిల్స్ పై ఆధారపడుతున్నారు. ఒక్కో సారి ఈ సంఖ్య 3 వేలకు చేరుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
