జేసీ దివాకర్‌రెడ్డికి స్టేషన్‌ బెయిల్‌

జేసీ దివాకర్‌రెడ్డికి స్టేషన్‌ బెయిల్‌

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసులు స్టేషన్‌ బెయిలిచ్చారు. దాదాపు 7 గంటల తర్వాత జేసీకి బెయిల్  లభించింది. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు చేశారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి శనివారం అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆ తర్వాత బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే బెయిల్ ఇవ్వకుండా పోలీసులు ఆలస్యం చేయడంతో…పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.  పోలీస్ స్టేషన్ ముందు జేసీ అనుచరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జేసీకి స్టేషన్‌ బెయిల్ ఇచ్చారు.

మరోసారి పోలీసులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, నెలకోసారి స్టేషన్ లో సంతకం చేసి వెళ్లాలన్న షరతులు విధించారు పోలీసులు.