హైకోర్టులో స్పీకర్ కు ఊరట

 

  • ఎన్నికలప్పుడు అనుమతి లేకుండా దీక్షపై నమోదైన కేసు డిస్మిస్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: 2019లో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉండగా పర్మిషన్ లేకుండా నిరాహార దీక్ష చేశారంటూ దాఖలైన కేసులో స్పీకర్‌‌‌‌‌‌‌‌,  వికారాబాద్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే  గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కు హైకోర్టులో ఊరట లభించింది. కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ అనుమతి లేకుండా వికారాబాద్‌‌‌‌‌‌‌‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఎం. రాంబాబు అనే వ్యక్తి కేసు వేశారు. 

దీన్ని కొట్టేయాలంటూ స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ సోమవారం విచారించారు. అడ్వకేట్ వాదిస్తూ.. నిరాహార దీక్షలో పిటిషనర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొనలేదన్నారు. తప్పుడు సమాచారంతో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు.వాదనల అనంతరం స్పీకర్ పై ఉన్న కేసును కొట్టివేస్తూ హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది.