మరో సంచలనం..రిలయన్స్ నుంచి జియో మార్ట్

మరో సంచలనం..రిలయన్స్ నుంచి జియో మార్ట్

రిలయన్స్ మరో సంచలానానికి తెర లేపింది. జియోతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్.. జియో మార్ట్ తో ఈ కామర్స్ లోకి అడుగుపెట్టింది. మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ముంబై, థానే  కళ్యాణ్‌ నగర్లో  జియో మార్ట్ సేవలను  ప్రారంభించింది. తర్వాత ఇండియా అంతట తన మార్కెట్ ను విస్తరించనుంది. జియో మార్ట్ ద్వారా మూడు కోట్ల షాప్ లకు, 20 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యేలా  అంచనా వేస్తుంది రిలయన్స్.

జియో మార్ట్ సేవల కోసం కస్టమర్స్ ముందుగా  ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. జియో మార్ట్ లో మొదటగా 50 వేల రకాల ప్రాడక్ట్స్ ను  కస్టమర్స్ కు అందుబాటులో ఉంచుతుంది. అంతేగాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఉచిత హోమ్ డెలీవరీ , కస్టమర్లు వస్తువులు తిరిగి ఇవ్వడం, తక్కువ సమయంలో త్వరగా డెలీవరీ వంటి సేవలు అందిస్తామని జియో మార్ట్ తన వెబ్ సైట్లో తెలిపింది.