చీరల బిజినెస్ లోకి ముకేశ్ అంబానీ

చీరల బిజినెస్ లోకి ముకేశ్ అంబానీ

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రతి రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తునారు. లేటెస్టుగా చీరల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రీటైల్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతోంది. చీరలతో పాటు భారతీయ సాంప్రదాయ దుస్తుల అమ్మకాల కోసం 'అవంత్రా' బ్రాండ్ నేమ్ తో స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ పండుగ సీజన్ లోనే మొదటి స్టోర్ ను బెంగళూరులో ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఏపీలో స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్ కు పోటీగా ఈ వ్యాపారాన్ని అంబానీ చేపట్టబోతున్నట్టు సమాచారం. తనిష్క్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ సంస్థలు కూడా త్వరలోనే సాంప్రదాయ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. అవంత్రా తన సొంత బ్రాండ్ దుస్తులతో పాటు నల్లీ సిల్క్స్, పోతీస్ వంటి ఇతర బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనుంది. అంతేకాదు ఆయా ప్రాంతాల్లోని నేత కార్మికులతో అగ్రిమెంట్ చేసుకోనుంది.