గుడ్న్యూస్..Jio న్యూఇయర్ రీచార్జ్ ప్లాన్..ఖర్చు కంటే ఎక్కువ బెనిఫిట్స్..

2025 కొత్త సంవత్సరం కానుకగా జియో కొత్త రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రీచార్జ్ తో అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీటితో షాపింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రీచార్జ్ ధరకంటే ఎక్కువ షాపింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా తన పార్టినర్స్ వెబ్ సైట్స్ ద్వారా అసాధారణ బెనిఫిట్స్ తో 2వేల150 రూపాయల విలువైన షాపింగ్ వోచర్లు, కూపన్లను అందిస్తోంది.  న్యూఇయర్ వెల్ కమ్ ప్లాన్ గా పిలువబడే ఈ రీచార్జ్ ప్లాన్ ధర రూ.2025 మాత్రమే. 

జియో న్యూఇయర్ వెల్ కమ్ ప్లాన్.. 

జియో న్యూఇయర్ వెల్ కమ్ ప్లాన్  రీచార్జ్ చేసుకోవడం అనేక షాపింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.. 2025 రూపాయల విలువైన ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే.. 200 రోజులు వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. అయితే 4G  కనెక్షన్ ద్వారా రోజుకు 2.5 GB చొప్పున 500 GB ల డేటా పొందవచ్చు. రోజుకు 100SMS లు పొందవచ్చు. 200 రోజుల వ్యాలిడిటీ ఉన్న నెలకు 349 రీచార్జ్ ప్లాన్ తో పోల్చుకుంటే ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా రూ 468 రూపాయలు సేవ్ చేయొచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్ జనవరి 11 , 2025 నుంచి అందుబాటులో వస్తుంది. 

డేటా,వాయిస్ బెనిఫిట్స్ తో పాటు  అదనంగా న్యూఇయర్ వెల్ కమ్ ప్లాన్ ద్వారా షాపింగ్ వోచర్లు, కూపన్లను అందిస్తుంది. రూ.2,500 షాపింగ్ విలువపై  కూపన్లపై రూ.500 Ajio డిస్కౌంట్ కూపన్, కనీసం రూ.499 విలువైన Swiggy ఆర్డర్‌లపై 150 రూపాయల డిస్కౌంట్  వోచర్, Easemytrip.com మొబైల్ యాప్ , వెబ్‌సైట్‌లో చేసిన విమాన బుకింగ్‌లపై 1,500 తగ్గింపు పొందవచ్చు. ఈ కూపన్లు ఆండ్రాయిడ్ , iOSలో లభించే MyJio యాప్ నుంచి అందుబాటులో ఉంటాయి.