హైదరాబాద్, వెలుగు: పండగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. వందలాది టెక్ ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఉన్నాయని తెలిపింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌తోపాటు www.reliancedigital.in లో ఈ సేల్ ఈ నెల మూడో తేదీ నుంచి పదో తేదీ వరకు ఉంటుంది. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్టులతో కొంటే అదనంగా పదిశాతం డిస్కౌంటు ఉంటుంది. పేటీఎం ద్వారా కొంటే రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు, హోమ్ అప్లయన్సెన్స్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. ఈఎంఐ ఆప్షన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే 3 గంటల్లోపు డెలివరీ ఇస్తామని (కొన్నిచోట్ల మాత్రమే) కంపెనీ పేర్కొంది.
