అన్యాయం ఈమె కంటపడిందంటే.. ఖేల్ ఖతం

అన్యాయం ఈమె కంటపడిందంటే.. ఖేల్ ఖతం
  • రియల్ లైఫ్ సూపర్ ఉమెన్

రేఖా మిశ్రా. ఈమె రియల్ లైఫ్ సూపర్ విమెన్. అన్యాయం కంటపడితే అంతు చూసే వరకు వదలదు . తప్పు చేస్తే ఎంతటి వాళ్లకైన  ముచ్చెమటలు పట్టిస్తుంది.  కళ్లు చెదిరే ఫైట్స్ చేస్తుంది. ప్రేమగా బాధితుల తల నిమురుతూ నేనున్నాంటూ ధైర్యాన్నిస్తుంది. అందుకే  ఈమె రియల్ లైఫ్ సూపర్ విమెన్. ఈ పోలీస్  ఇప్పటివరకు 950 మంది పిల్లల్ని వ్యభిచార ముఠాల బారి నుంచి  కాపాడింది. ఇల్లు వదిలి వచ్చేసిన ఎంతోమంది పిల్లల్ని తిరిగి తల్లి ఒడికి చేర్చింది. రేఖా మిశ్రాకి చిన్నప్పట్నించి ఒక్కటే కల. అదే పోలీస్ యూనిఫాం. అది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కల. ఆమె తండ్రి దేశం తరపున  ఆర్మీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని గెలిచాడు. ఆయన బాటలో తనూ దేశానికి సేవ చేయాలనుకుంది. అందుకోసం పోలీస్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. తన కలని నిజం చేసుకోవడానికి చిన్నప్పట్నించీ గ్రౌండ్లో పరుగులు తీసింది.  పుస్తకాల పురుగయ్యింది. చివరికి 2015లో తను అనుకున్నది సాధించింది. వ్యభిచార ముఠాల  నుంచి అమ్మాయిలను కాపాడడానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్లో ఛార్జ్ తీసుకుంది.  డ్యూటీలో చేరిన మొదటి రోజు నుంచి తన మిషన్లో వందశాతం సక్సెస్ అయ్యింది. మిస్సింగ్, కిడ్నాప్ కేసులెన్నింటినో సాల్వ్ చేసింది.