ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సేవలు అక్కర్లేదంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు ట్వీట్ల వరద కురిపిస్తున్నారు. ‘రిజెక్ట్ జొమాటో’ అన్న హ్యాష్ ట్యాగ్‌తో భారీ సంఖ్యలో పోస్టులు చేస్తున్నారు. ఒక కస్టమర్‌కు భాష విషయంలో సమస్య ఎదురు కావడంతో హిందీ ఎందుకు నేర్చుకోలేదంటూ జొమాటో కస్టమర్ సర్వీస్ ప్రతినిధి కామెంట్ చేయడంతో దానికి నిరసనగా ‘రిజెక్ట్ జొమాటో’ ట్వీట్ల హోరు మొదలైంది.
Ordered food in zomato and an item was missed. Customer care says amount can't be refunded as I didn't know Hindi. Also takes lesson that being an Indian I should know Hindi. Tagged me a liar as he didn't know Tamil. @zomato not the way you talk to a customer. @zomatocare pic.twitter.com/gJ04DNKM7w
— Vikash (@Vikash67456607) October 18, 2021
మాకు తమిళ్ రాదు.. మీరు హిందీ ఎందుకు నేర్చుకోలే
తమిళనాడుకు చెందిన వికాస్ జొమాటోలో చికెన్ కాంబో ఆర్డర్ చేశాడు. అయితే తన ఆర్డర్‌లో ఒక ఐటమ్ మిస్ అయింది. దీంతో అతడు ఈ విషయాన్ని చెబుతూ జొమాటో కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించాడు. అయితే ఆ కస్టమర్ సర్వీస్ పర్సన్‌కు తమిళనాడులో హోటల్ వ్యక్తితో మాట్లాడి సమస్య తీర్చడానికి భాష రాదని చెప్పాడు. దీంతో మీరు తమిళనాడులో జొమాటో సర్వీసులు రన్ చేసేటప్పుడు తమిళ్ వచ్చిన వాళ్లను ఉద్యోగంలో పెట్టుకుని కస్టమర్లకు సరైన సర్వీస్ ఇవ్వాలని వికాస్ సూచించాడు. అయితే దీనికి కస్టమర్ సర్వీస్ ప్రతినిధి సమాధానంగా మీరే హిందీ నేర్చుకోండంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వికాస్ ఈ విషయాన్ని వివరిస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన హిందీ రాదన్న కారణంతో తన డబ్బులు రీఫండ్ చేయడం కుదరదని కస్టమర్ సర్వీస్ ప్రతినిధి రిప్లై ఇచ్చాడని, పైగా ఆ వ్యక్తికి తమిళ్ రాకపోవడంతో తనపై అబద్ధాలకోరు అని ముద్ర వేసే ప్రయత్నం చేశాడని, ఇంకా హిందీ నేర్చుకోవాలని క్లాస్ పీకాడని, కస్టమర్లతో వ్యవహరించే తీరు ఇది కాదంటూ ట్వీట్ చేశాడు.
Vanakkam Vikash, we apologise for our customer care agent's behaviour. Here's our official statement on this incident. We hope you give us a chance to serve you better next time.
— zomato (@zomato) October 19, 2021
Pls don't #Reject_Zomato ♥️ https://t.co/P350GN7zUl pic.twitter.com/4Pv3Uvv32u
ఉద్యోగిని తీసేస్తున్నామని చెప్పిన జొమాటో.. వద్దన్న వికాస్
వికాస్ ట్వీట్ తర్వాత భారీ సంఖ్యలో నెటిజన్లు ‘రిజెక్ట్ జొమాటో’ అంటూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో జొమాటో కంపెనీ స్పందించింది. దయ చేసి జొమాటోను రిజెక్ట్ చేయొద్దంటూ ఆ సంస్థ కోరింది. ఆ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ప్రవర్తనకు తాము క్షమాపణ కోరుతున్నామని ట్వీట్ చేసింది. భాష విషయంలో ఆ వ్యక్తి చేసిన కామెంట్స్‌తో తమకు సంబంధం లేదని, అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని చెప్పింది. తమిళ్ వెర్షన్‌లో యాప్ కూడా తెస్తున్నామని, కోయంబత్తూర్‌లో తమిళ్ కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని జొమాటో వివరణ ఇచ్చింది. అయితే దీనికి వికాస్ రిప్లై ఇస్తూ.. అలా ఒక ఉద్యోగిని తొలగించవద్దని, అతడిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుని సరైన శిక్షణ ఇవ్వాలని కోరాడు.
Hello @zomato. Apart from the clarification regarding the issue, I request you to reconsider on recruiting back the employee rather than terminating. I suggest to give them a proper training instead.
— Vikash (@Vikash67456607) October 19, 2021
தமிழர்களின் மரபு சுயமரியாதை யே தவிர பழி வாங்குதல் அல்ல.@zomatocare. Thanks?
