భారీగా పెరిగిన వాహనాల రెన్యూవల్ ఫీజులు.. రూ.600ల ఫీజు రూ.5వేలకు పెంపు

భారీగా పెరిగిన వాహనాల రెన్యూవల్ ఫీజులు.. రూ.600ల ఫీజు రూ.5వేలకు పెంపు

న్యూఢిల్లీ: వాహన వినియోగదారులకు కేంద్రం షాకిచ్చింది. పాత కార్ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజులు భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది. 15 ఏళ్లకు మించి పాతబడిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజును 8 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్లు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్‎కు ప్రస్తుతం 600 రూపాయలు వసూలు చేస్తుండగా.. ఏప్రిల్ 1 తర్వాత 5 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పాత బైక్‎ల రెన్యువల్ కోసం ప్రస్తుతం 500 రూపాయలు వసూలు చేస్తుండగా.. ఇకపై వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 

15 ఏళ్లు పైబడిన బస్సు లేదా ట్రక్కు ఫిట్‎నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ కోసం ప్రస్తుతం 1500 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఇకపై 12 వేల 500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మధ్యస్థాయి గూడ్స్ లేదా ప్యాసింజర్ వాహనానికి, ఇంపోర్ట్ చేసుకున్న బైకులకు పది వేలు, కార్లకు 40 వేల రూపాయల చొప్పున కట్టాల్సి ఉంటుంది. ఫిట్‎నెస్ సర్టిఫికెట్ ఇన్ టైంలో తీసుకోకపోతే.. రోజుకు 50 రూపాయల చొప్పున లేట్ ఫీజు వసూలు చేస్తారు. ప్రైవేట్  వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేట్ అయితే.. ప్రతి నెలకు 300 చొప్పున, కమర్షియల్ వాహనాలకు 500 రూపాయల చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

For More News..

దసరా మోత.. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీలు

మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

పండుగపూట గ్యాస్ ధరల మంట.. మరో రూ. 15 పెంపు