SA vs PAK: సిరీస్ సౌతాఫ్రికాదే: సెంచరీతో పాకిస్థాన్ బౌలర్లపై శివాలెత్తిన హెండ్రిక్స్

సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన పాకిస్థాన్ టీ20 ఫార్మాట్ ను కోల్పోయింది. తొలి టీ20ని తృటిలో చేజార్చుకున్న పాకిస్థాన్ రెండో టీ20లో భారీ స్కోర్ చేసినా నిరాశ తప్పలేదు. సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీతో మ్యాచ్ ను పాక్ చేతుల్లోనుంచి లాగేసుకున్నాడు. 63 బంతుల్లో 117 పరుగులు చేసిన హెండ్రిక్స్ ఇన్నింగ్స్ లో ఏకంగా 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. పాక్ బౌలర్లను చితక్కొడుతూ సఫారీ జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

హెండ్రిక్స్ కెరీర్ లో ఇదే తొలి టీ20 సెంచరీ కావడం విశేషం. హెండ్రిక్స్ సెంచరీకి తోడు వాన్ డెర్ డస్సెన్ హాఫ్ సెంచరీతో (38 బంతుల్లో 66 నాటౌట్‌) రాణించడంతో సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి టీ20లో 11 పరుగులతో సౌతాఫ్రికా పాకిస్థాన్ పై గెలిచిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టీ20 శనివారం (డిసెంబర్ 14) జరుగుతుంది. 

ALSO READ : NZ vs ENG: కెరీర్‌లో చివరి టెస్ట్.. కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ క్రికెటర్ ఎమోషనల్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ 57 బంతుల్లో అజేయంగా 98 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు కారణంగా సెంచరీ చేయలేకపోయాడు. 206 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.