తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వరుస వివాదాలు చుటుచేసుకుంటున్నాయి. రీల్స్ చేయాలన్నా.. సినిమా సన్నివేశాలు చిత్రీకరించాలన్నా అందరూ శ్రీవారి ఆలయాన్నే ఎంచుకుంటున్నారు. ఈ మధ్యనే ఓ యువతి తిరుమల అలిపిరి గేట్ వద్ద పుష్ప 2 సినిమాలోని ఐటెం సాంగ్‌కు స్టెప్పులేసింది. కిస్ కిస్ కిస్ కిస్సిక్.. కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ అంటూ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎర్రివేషాలు వేసింది. ఆ తరువాత వీడియో వైరల్ అవ్వడంతో శ్రీవారి భక్తులు మండిపడటం.. యువతి క్షమాపణలు చెప్పడం జరిగాయనుకోండి.
తాజాగా, ఈ మధ్య విడుదలైన '35 చిన్నకథ కాదు' చిత్రంలో తిరుమల సీన్లు ఉండటంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఈ సినిమాలో హీరో శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద కూర్చొని ఉన్న సీన్లు ప్రత్యక్ష్యమయ్యాయి. అంతేకాదు, తిరుమల ఘాట్ రోడ్ సీన్లు మూవీలో చూపించారు దర్శకుడు. తిరుమలలో సినిమా షూటింగ్ లు తీయడంపై ఎప్పటి నుండో ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. ఇదెలా జరిగిందని శ్రీవారి భక్తులు టీటీడీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. వివాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన తి.తి.దే. మౌనంగా ఉంటూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ALSO READ | శ్రీవారిని దర్శించుకున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతీ
నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన 35 చిన్నకథ కాదు చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో చిత్ర టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.