ఐదుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు

అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి.  తమిళ కూలీల కన్ను క్వాలిటి ఎర్రచందనంపై పడింది. విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.  సుండుపల్లి దగ్గర  పించా డ్యాంకు సమీపంలో ఎర్రచందనం దుంగలను కారులో లోడ్ చేస్తున్న ఐదగురికి అరెస్ట్ చేశారు.  నిందితుల  నుంచి 20ఎర్రచందనం దుంగలతో సహా  కారు,  మూడు బైక్ లను  స్వాధీనం చేసుకున్నారు.

తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తమకు ముందస్తుగా సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు.  అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్, జిల్లేళ్ల మంద అటవీ పరిధిలోని పింఛా డ్యాం వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు.  నిందితులు   తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకాకు చెందిన బాలు (36), సీ.కృష్ణన్ (30), వేలూరు జిల్లా ఆనైకట్టుకు చెందిన ప్రభు శంకరన్ (29), ప్రభు జయరామన్ (33), ఎస్. అరుల్ (20)లను అరెస్టు చేశారు. . టాస్క్ పోర్సు పోలీసు స్టేషన్ ఎస్ఐ మోహన్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి  స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ కోటి రూపాయిలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  కూంబింగ్ లో పాల్గొన్న  సిబ్బందిని కర్నూల్ రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ అభినందించి, రివార్డులు ప్రకటించారు.