లేటెస్ట్ స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేసిన రెడ్‌మీ

లేటెస్ట్ స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేసిన రెడ్‌మీ

రెడ్‌మీ ప్రొడక్ట్స్ బడ్జెట్ రేంజ్ లో దొరుకుతాయి కాబట్టి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. మొదట స్మార్ట్ ఫోన్లకే పరిమితమైన రెడ్‌మీ ఇప్పుడిప్పుడే స్మార్ట్ వాచ్ రంగంలోకి అడుగుపెడుతుంది. తాజాగా రెండు స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేసింది. రెడ్‌మీ వాచ్ 3, రెడ్‌మీ బ్యాండ్ 2 పేరిట వీటిని తీసుకొచ్చింది. రెడ్‌మీ k60తో ఈ రెండు వాచ్ లు మార్కెట్లోకి రాబోతున్నాయి.

రెడ్‌మీ వాచ్ 3 స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ వాచ్ 3 బడ్జెట్ రెంజ్ లో రాబోతుంది. 1.75 అంగుళాల కలిగిన ఓఎల్ ఈడీ స్క్రీన్, 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 12 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మొత్తం 121 స్పోర్ట్స్ మోడ్స్ కి సపోర్ట్ చేస్తుంది. హార్ట్ రేట్ మానిటర్, ఎస్ పీఓటూ మెజర్మెంట్ కూడా ఉన్నాయి. ఈ వాచ్ ధర. రూ.7000 ఉంది.

రెడ్‌మీ బ్యాండ్ 2 స్పెసిఫికేషన్స్

ఈ వాచ్ 172x320 పిక్సెల్ రిజల్యూషన్ లో రాబోతుంది. 1.47 అంగుళాల డిస్ ప్లే ఉండనుంది. 210 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. ఒక్కసారి లాంచ్ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇందులో 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది. ఈ వాచ్ ధర. రూ. 2000 ఉంది.