ఆ భూమిలో ఫంక్షన్​ హాల్​ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట శివారులోని వరద కాలువ దగ్గర గ్రామస్తుల‌ ఆందోళన చేశారు.  గ్రామ శివారులోని రెండు ఎకరాల పదిగుంటల భూమిని రెడ్డి కులస్తులు అక్రమంగా ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఆ భూమిని రైతులు  పంటను ఆక్రమించుకోవడానికి ఉపయోగించుకొనేవారని... ఇప్పుడు అక్కడ ఫంక్షన్ హాల్​ నిర్మిస్తుండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ఎస్సారెస్పీ కెనాల్ పక్కనున్న రెండు ఎకరాల పదిగుంటల భూమిని  కొంతకాలంగా  రెడ్డి జన సంక్షేమ సంఘం వాడుకుంటున్నది.  మాజీ ఎమ్మెల్యే చెన్నమినేని రమేష్ బాబు అప్పటి కలెక్టర్ ద్వారా తమకు అనుమతులు ఇప్పించ్చారని... పేదవారు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ కడుతున్నామని రెడ్డి సంఘం సభ్యులు చెబుతున్నారు. భూమిలోని ఫెన్సింగ్, మామిడి చెట్టును దుంపేట గ్రామస్థుల  తొలగించడంతో... రెడ్డి రెడ్డి సంఘం  వారికి  మధ్య గొడవ  జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఇరు వర్గాతో చర్చించారు.