5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు  పడే అవకాశమున్నట్లు తెలిపి రెడ్ అలెర్ట్  జారీ చేసింది.  

కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపి ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

మరోవైపు హైదరాబాదులో సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారే సూచనల కనిపించట్లేదని.. రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.