కిక్కే కిక్కు : హైదరాబాద్ సిటీలో బార్ అండ్ రెస్టారెంట్ లో రికార్డింగ్ డాన్సులు

హైదరాబాద్ సిటీలో బార్లు సరికొత్తగా మెనూ యాడ్ చేశాయి.. కస్టమర్లకు కిక్కు ఎక్కించేందుకు.. ఎట్రాక్ట్ చేసేందుకు.. బిజినెస్ పెంచుకునేందుకు అమ్మాయిలను రంగంలోకి దింపారు. నిన్నా మొన్నటి వరకు పండుగలు, జాతర్లలో మాత్రం ఉండే రికార్డింగ్ డాన్సులను.. ఇప్పుడు బార్లలోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున సనత్ నగర్ లోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ లో అమ్మాయిలతో గానా బజానా చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సనత్ నగర్ ఏరియాలోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ లో.. కస్టమర్లకు మరింత కిక్కు ఇచ్చేందుకు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. 11 మంది అమ్మాయిలతో.. డీజే సౌండ్స్ మధ్య మస్త్ మస్త్ డాన్సులు చేయిస్తున్నారు నిర్వాహకులు. కస్టమర్లకు మరింత కిక్కు ఇచ్చేందుకు.. ఎట్రాక్ట్ చేసేందుకే ఈ డాన్సులు పెట్టినట్లు నిర్వహకులు చెప్పటం విశేషం. కొన్ని నెలలుగా ఇలాగే జరుగుతుందని.. విషయం తెలిసిన వెంటనే దాడులు చేసి.. తనిఖీలు చేసినట్లు చెబుతున్నారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 

Also Read :- ACB ఎదుట IAS అరవింద్ కుమార్

తనిఖీకి వెళ్లిన సమయంలో 11 మంది అమ్మాయిలు డాన్సులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు పోలీసులు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. డీజే టీంను అక్కడి నుంచి తరలించారు. పోలీసుల దాడులతో బార్ యజమానులు, నిర్వాహకులు పారిపోయారు. నోటీసులు జారీ చేశారు. వాళ్లను అరెస్ట్ చేస్తామని చెప్పారు పోలీసులు. ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ పై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు పోలీసులు.