అజిత్ దోవల్‌‌ ఇంటిపై టెర్రరిస్టుల రెక్కీ

అజిత్ దోవల్‌‌ ఇంటిపై టెర్రరిస్టుల రెక్కీ

న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ ఇంటిపై టెర్రరిస్టులు నిఘా వేసినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కీ నిర్వహించారని పోలీసుల కస్టడీలో ఉన్న ఓ టెర్రరిస్టు బయటపెట్టాడు. జైషే మహ్మద్ టెర్రరిస్టు ముఠాకు చెందిన హిదాయత్ ఉల్లా మాలిక్ అనే ఉగ్రవాదిని రీసెంట్‌గా జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో మాలిక్ ఈ విషయాన్ని వెల్లడించాడని సమాచారం. దీంతో దోవల్ ఇల్లు, ఆఫీస్ వద్ద సెక్యూరిటీని పటిష్టం చేశారు. పాకిస్థాన్‌‌లోని ఓ వ్యక్తి ఆదేశాలతో 2019లో దోవల్‌‌ ఇంటిపై తాను రెక్కీ నిర్వహించానని పోలీసులతో మాలిక్ చెప్పాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.