భవిష్యత్ కార్యాచరణపై రెబల్ ఎమ్మెల్యేల చర్చలు

భవిష్యత్ కార్యాచరణపై రెబల్ ఎమ్మెల్యేల చర్చలు

మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చేట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు మరింత హీటెక్కుతున్నాయి. శివసేను నుంచి మరో మంత్రి షిండే వర్గంలో చేరిపోయారు. షిండే క్యాంపులో 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ఉద్దవ్ చెబుతుండగానే.... మరో మంత్రి ఉదయ్ సామంత్, ఏక్ నాథ్ షిండే క్యాంపులో చేరిపోయారు. దీంతో షిండే క్యాంపులో చేరిన మంత్రుల సంఖ్య తొమ్మిదికి చేరినట్లు తెలుస్తోంది.

మరో వైపు రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఉద్దవ్ థాక్రే సిద్దమవుతున్నారు. రెబల్ నేతలు ఏక్ నాథ్ షిండే, గులాబ్ రావ్ పాటిల్, దాదాలను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే షిండే క్యాంపు మాత్రం ఏ పార్టీలో విలీనం చేయాలనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏ పార్టీలో చేరాలి అనే అంశంపై రెబల్ నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు15 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది శివసేన. దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బృందం కూడా న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టింది.