రియల్‌మీ సంస్థ తమ కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మీ జీటీ నియో 5ను ఫిబ్రవరి 15న చైనాలో విడుదల చేయనున్నారు. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ కేవలం 10 నిమిషాల్లోపే ఫుల్ ఛార్జ్ అవుతుందని, ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్ ఇదేనని రియల్‌మీ కంపెనీ ప్రకటించింది. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉందని వెల్లడించింది. 30 సెకండ్లు ఛార్జ్ చేస్తే 2 గంటలు మాట్లాడుకోవచ్చని పేర్కొంది.
స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్‌తో రాబోతోంది. 6.74 అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కలిగి ఉంటుంది. 16GB /256GB వేరియంట్ ధర రూ.38,000 వరకు ఉంది.
