చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్ మీ ‘సీ3’ పేరుతో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాకు తీసుకొచ్చింది. వెనుకవైపు రెండు కెమెరాలు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 3జీబీ ర్యామ్+32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ మోడల్ ధర రూ.6,999 కాగా, 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ నెల 14 నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కామ్ ఈ ఫోన్ సేల్ కు వస్తుంది. 6.52 ఇంచ్ హెచ్ డీ+డిస్ ప్లే , మీడియాటెక్ హిలియో జీ70 ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 12ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

