- చదరపు అడుగు ధర రూ. 6,850
- 1,355 చదరపు అడుగుల నుంచి అందుబాటులోకి ఫ్లాట్స్
హైదరాబాద్, వెలుగు : రియల్ ఎస్టేట్ కంపెనీ మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ గురువారం తెల్లాపుర్ దగ్గర ‘మై హోమ్ సయూక్’ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. మొత్తం 25.37 ఎకరాల్లో ‘మై హోమ్ సయూక్’ నిర్మించనున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతిమా గ్రూప్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను డెవలప్ చేస్తున్నారు. 12 టవర్లు కట్టనుండగా, ఫేజ్ 1 కింద ఆరు టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. బుకింగ్స్ కూడా ఈ ఆరు టవర్లలోని ఫ్లాట్స్ కోసం ఓపెన్ చేశారు. లాంచింగ్ ధర చదరపు అడుగుకి రూ. 6,850 గా నిర్ణయించారు.
4 ఏళ్లలో పూర్తి..
ఫేజ్ 1 కింద ఆరు టవర్లను నిర్మించనున్నామని, వీటి నిర్మాణం వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మై హోమ్ ప్రకటించింది. మై హోమ్ సయూక్‌లో ప్రతీ ఫ్లోర్‌లో 8 ఫ్లాట్‌లు ఉంటాయి. ఒక్కో టవర్‌లో 39 ఫ్లోర్‌లు (గ్రౌండ్ ఫ్లోర్ మినహాయించి) ఉంటాయి. 2 బీహెచ్‌కే, 2.5 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు మై హోమ్ సయూక్‌లో ఉంటాయి. 1,355 చదరపు అడుగుల నుంచి 2,262 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, ప్రీమియం స్టైల్‌లో నిర్మిస్తామని మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రెసిడెంట్ (ప్రాజెక్ట్స్) కే.ఆర్ సాయి అన్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాల దూరంలోనే..
‘మై హోమ్ సయూక్’ ప్రాజెక్ట్‌కు దగ్గరలో విప్రో జంక్షన్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వంటివి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇంకా ప్రీమియం రెస్టారెంట్లు, మాల్స్, స్కూళ్లు వంటివి కూడా ఉన్నాయని వివరించింది. ఈ ప్రాజెక్ట్‌కు దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతోందని, హాస్పిటల్ కూడా వస్తోందని పేర్కొంది. లక్ష చదరపు అడుగుల్లో విస్తరించే క్లబ్ హౌస్‌ను నిర్మిస్తామని, రెండు రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్టులను, టెంపరేచర్‌ను కంట్రోల్ చేయడానికి వీలుండే స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. నివాసానికి సౌకర్యంగా ఉండి, మంచి లొకేషన్లలో విస్తరించిన హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడంలో గత 35 ఏళ్ల నుంచి మై హోమ్ ముందుందని కంపెనీ చైర్మన్ రామేశ్వర్ రావు అన్నారు. మై హోమ్ సయూక్‌ను కూడా ఇలాంటి కమిట్‌మెంట్స్‌తోనే నిర్మిస్తామని చెప్పారు.
