అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ కోసం ఓ హిస్టారికల్ బ్రిడ్జ్‌ను కూల్చడానికి రెడీ అయ్యింది నెదర్లాండ్ గవర్నమెంట్. బెజోస్ కోసం రూ. 3,600 కోట్లతో తయారు చేసిన యాట్(పెద్దసైజ్ లగ్జరీ బోట్) ను డెలివరీ చేయడానికి రోటర్‌డమ్‌లోని బ్రిడ్జ్‌ను కూల్చాల్సిన అవసరం ఉంది. సముద్రంలోకి ఈ యాట్‌ను పంపడానికి ఈ బ్రిడ్జ్ అడ్డుగా ఉందని, ఈ హిస్టోరికల్ బ్రిడ్జ్‌ను మిడిల్‌లో కూల్చేందుకు డచ్ లోకల్ అధికారులు అంగీకరించారని ఆ దేశ మీడియా పేర్కొంది. 417 అడుగుల పొడవున్న ఈ యాట్‌ను డచ్ కంపెనీ ఓసియాక్కో తయారు చేసింది. ‘కోనింగ్స్‌హెవన్‌బ్రగ్ డీ హెఫ్’ బ్రిడ్జ్‌ను 1927 లో ఏర్పాటు చేశారు. 2017 లో రినువేషన్ చేశారు. హిస్టోరికల్ బ్రిడ్జ్‌ను కూల్చడానికి ప్రభుత్వం రెడీ అవ్వడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
