రెడీ టు కుక్ ఫుడ్డుకు కలిసొచ్చిన కరోనా టైమ్

రెడీ టు కుక్ ఫుడ్డుకు కలిసొచ్చిన కరోనా టైమ్

బాగా పెరిగిన సేల్స్

పరాటా నుంచి చేప మాంసం వరకు అన్నింట్లో జోరు

ప్యాకేజ్డ్ స్వీట్స్ కూడా రుచికరమయ్యాయి .. చిన్న పట్టణాల నుంచే ఫుల్ డిమాండ్

ఫుడ్ సేఫ్టీ పై ఇప్పుడు సర్వత్రా చర్చ

న్యూఢిల్లీ : కరోనా టైమ్‌‌‌‌లో రెడీ–టూ–కుక్ ఫుడ్స్ సెగ్మెంట్‌‌‌‌ బాగా జోరందుకుంది. కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితమవడంతో రెడీ–టూ– ఫుడ్‌‌‌‌ను ఇండ్లకే తెప్పించుకుంటున్నారు. జూన్‌‌‌‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ప్యాకేజ్డ్ ఫుడ్ బ్రాండ్ ఐడీ ఫ్రెష్ ఫుడ్‌‌‌‌ పరాటా సేల్స్‌‌‌‌ గత క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 60 శాతం పెరిగాయి. అదేవిధంగా మేక మాంసం, సీ ఫుడ్‌‌‌‌కు చెందిన లిసియస్ రెడీ–టూ–ఈట్ మీట్‌‌‌‌ సేల్స్ 300 శాతానికి పైగా ఎగిశాయి. రెడీ–టూ–కుక్ కేబాబ్స్, సీఫుడ్ సేల్స్ రెండింతలు పెరిగాయి. రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం, హోమ్‌‌‌‌ కుకింగ్‌‌‌‌పై వినియోగదారులు పెట్టిన ఖర్చులు 61 శాతం పెరిగాయి. రెడీ–టూ–హీట్ సెగ్మెంట్‌‌‌‌లో ఇడ్లి పిండి, పన్నీరు సేల్స్ గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. గత క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వీటి  సేల్స్ 20 శాతానికి పైగా పెరిగినట్టు ఐడీ ఫ్రెష్ తెలిపింది. ప్యాకేజ్డ్ ఇండియన్ స్వీట్స్ సేల్స్ కూడా పెరిగినట్టు అమూల్ బ్రాండ్‌‌‌‌కు చెందిన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) తెలిపింది. కన్జూమర్ ప్రిఫరెన్స్‌‌‌‌లు మారడంతో, కంపెనీ కొత్తగా తయారీ యూనిట్‌‌‌‌ పెట్టాలని నిర్ణయించినట్టు జీసీఎంఎంఎఫ్‌‌‌‌ ఎండీ ఆర్ఎస్ సోధీ తెలిపారు. ఇప్పటి వరకు సగం వరకు ప్యాకేజ్డ్ స్వీట్స్‌‌‌‌ను థర్డ్ పార్టీలే మాన్యుఫాక్చర్ చేస్తున్నాయి. అమూల్ గత కొన్ని నెలల నుంచి హల్దీ దూధ్, పంచామృత్, రస్ మలై, గులాబ్ జామ్‌‌‌‌ స్వీట్లను మార్కెట్లలోకి తీసుకొచ్చింది. గత రెండు మూడేళ్ల నుంచి రెడీ–టూ–ఫుడ్ ట్రెండ్ మెల్లమెల్లగా ప్రారంభమైందని, అయితే కరోనా టైమ్‌‌‌‌లో కన్జంప్షన్ బాగా పెరిగినట్టు పేర్కొన్నారు.  ఫస్ట్ నుంచి ప్యాకేజ్డ్ ఫ్రెష్ ఫుడ్‌‌‌‌కు దూరంగా ఉండే చిన్న పట్టణాల నుంచే డిమాండ్ బాగా రావడం ఆశ్చర్యకరంగా ఉందని సోధీ తెలిపారు.

‘గత మూడు నెలల కాలంలో చాలా మంది ప్రజలు ఇండ్లలోనే వండుకోవడానికి, తినడానికి ఆసక్తి చూపించారు. నాణ్యమైన, సురక్షితమైన ఫుడ్ ప్రొడక్టు‌‌‌లను కొనేందుకే కన్జూమర్లు మొగ్గు చూపారు. ప్రస్తుతం మారిన అభిప్రాయాలు లాంగ్‌‌‌‌ టర్మ్‌‌‌‌లో ఉంటాయని భావిస్తున్నాం’ అని లిసియస్ కో ఫౌండర్ వివేక్ గుప్తా కూడా తెలిపారు.  లిసియస్, ఐడీ ఫ్రెష్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి కంపెనీలన్నీ రెడీ–టూ–కుక్ ఫుడ్స్‌‌‌‌కు బాగా సేల్స్ పెరిగినట్టు చెప్పాయి. కొత్తరకం ఐటమ్స్‌‌‌‌ను కూడా ప్రజలు ఎక్కువగా ట్రై చేసినట్టు పేర్కొన్నాయి. వినియోగదారుల ఆసక్తులు, అభిప్రాయాలు మారుతోన్న ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అనేదే అత్యంత కీలకమైన అంశంగా మారింది. చాలా మంది ఇండియన్లు నాణ్యమైన, సురక్షితమైన ఫుడ్ ప్రొడక్ట్‌‌‌‌లనే ఎంపిక చేసుకుంటున్నట్టు లిసియస్ కో ఫౌండర్ అభయ్ హన్జురా చెప్పారు. బిగ్‌‌‌‌బాస్కెట్, మిల్క్‌‌‌‌బాస్కెట్, రెడీ–టూ–కుక్, రెడీ–టూ–ఈట్ సేల్స్‌‌‌‌ 1.7 టైమ్స్ పెరిగినట్టు గ్రోఫర్స్ కో ఫౌండర్ సౌరభ్ కుమార్ తెలిపారు. కన్జూమర్లలో ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని గమనించిన క్యూర్.ఫిట్ రెడీ–టూ–ఈట్ ప్రొడక్ట్‌‌‌‌లను లాంఛ్ చేసింది. రజ్మ మసాలా, దాల్ మఖానీ లాంటి  ఫుడ్స్‌‌‌‌ను ఇది ఆఫర్ చేస్తోంది.

రూ. 4,800 కోట్లకు రెడీ టూ కుక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌

వచ్చే ఐదేళ్లలో  రెడీ టూ కుక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ రూ. 4,800 కోట్లకు చేరుకుంటుందని రెడ్‌‌‌‌సీర్ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో రెడీ టూ ఈట్‌‌‌‌, రెడీ టూ కుక్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరిగిందని ఎంటీఆర్‌‌‌‌‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ ఫ్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ పేర్కొంది.  ఈ ప్రొడక్టు‌‌‌ల డిమాండ్‌‌‌‌ 20 శాతం పైగా పెరిగిందని తెలిపింది. వీటి ప్రొడక్షన్‌‌‌‌ను మరింత పెంచేందుకు ప్లాన్స్‌‌‌‌ వేస్తున్నామని పేర్కొంది. కొన్ని కేటగిరిలలో హోం కన్జంప్షన్‌‌‌‌ పెరిగిందని నెస్లే ఇండియా తెలిపింది. బయటతినడం తగ్గిందని, ఇళ్లలో మీల్స్‌‌‌‌ కన్జంప్షన్‌‌‌‌ పెరిగిందని మారికో అంగీకరించింది. కన్జూమర్లు తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని మారికో పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. ఈ –కామర్స్‌‌‌‌ వాటా పెరుగుతోందని నెస్లే పేర్కొంది. మారికో కస్టమర్ల కోసం డైరక్ట్‌‌‌‌ టూ హోమ్‌‌‌‌ కన్జూమర్ పోర్టల్‌‌‌‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా సఫోల, కోకో సోల్‌‌‌‌ బ్రాండ్లను విక్రయిస్తోంది.

గత క్వార్టర్లో 20 శాతం గ్రోత్!

ఒకప్పటిలా వంటకు ఎక్కువ టైమ్‌‌‌‌ కేటాయించడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. ‘వచ్చామా రెండు, మూడు నిముషాల్లో వంటయిపోయిందా!’ ఈ ధోరణి కన్జూమర్లలో పెరుగుతోంది. దీంతో రెడీ టూ ఈట్‌‌‌‌, రెడీ టూ కుక్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ ప్రొడక్టు‌‌లకు డిమాండ్‌‌‌‌ ఊపందుకుంటోంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ దెబ్బతో ఈ ప్రొడక్టులకు డిమాండ్‌‌‌‌ విపరీతంగా పెరిగింది. ప్రజలు ఇళ్లలోనే ఎక్కువగా ఉంటుండడంతో  హోం ఫుడ్‌‌‌‌ కన్జంప్షన్‌‌‌‌ భారీగా వృద్ధి చెందుతోంది. కన్జూమర్లు కొన్ని సార్లు వండటానికి  టైమ్‌‌‌‌ కేటాయిస్తున్నప్పటికీ  ఒకటి రెండు నిముషాల్లో పూర్తయ్యే వంటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని  వెంచర్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ ఫర్మ్‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ కన్వల్జిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ అన్నారు. దీంతో రెడీ టూ ఈట్‌‌‌‌, రెడీ టూ కుక్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరుగుతోందని చెప్పారు. మెట్రో, టైర్‌‌‌‌‌‌‌‌ 1 సిటీలలో ఈ డిమాండ్‌‌‌‌ ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు.

ఇప్పీ డిమాండ్‌‌‌‌ పెరిగింది..

ప్రస్తుతం కస్టమర్ల ఫుడ్‌‌‌‌  ట్రెండ్‌‌‌ను గమనిస్తున్నాం. కన్జూమర్లు శుభ్రంగా, సేఫ్‌‌‌‌గా ఉన్నాయనుకునే బ్రాండ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సబ్బులు, వంటి వాటితో పాటు  నూడుల్స్‌‌‌‌, బిస్కెట్స్‌‌‌‌ వంటి ప్రొడక్టు‌‌లకు డిమాండ్‌‌‌‌ పెరిగింది.

– ఐటీసీ ఫుడ్స్‌‌‌‌ చీఫ్‌‌‌‌ హేమంత్‌‌‌‌ మాలిక్‌‌‌‌

ఆర్డర్లు పెరుగుతున్నయ్..

అమెజాన్, సూపర్‌‌‌‌‌‌‌‌డైలీల నుంచి తమకు ఈకామర్స్ బాగా పెరిగాయి. – ఏప్రిల్‌‌–జూన్ మధ్యలో మా నెలవారీ అమ్మకాలు భారీ వృద్ధి సాధించాయి. ఈ గ్రోత్ 20 శాతం దాకా ఉంది. ఎప్పటికప్పుడు కస్టమర్ల నాడి తెలుకుంటున్నాం.

ఐడీ ఫ్రెష్ కో ఫౌండర్ పీసీ ముస్తఫా