ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆస్తులు వేలం వేయనున్నారు అధికారులు. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా పేరు మీద తీసుకున్న రుణాల ఎగవేత కేసులో డిసెంబరు 20న గంటా ఆస్తులు వేలం వేస్తామని నోటీసులు జారీ చేసింది ఇండియన్ బ్యాంక్. గంటా తీసుకున్న మొత్తం రుణం రూ. 209 కోట్లు కాగా తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 35.35 కోట్లు. దీనిపై గతంలో నోటీసులు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో గంటా శ్రీనివాస్ ఆస్తులు వేలం వేయనున్నట్లు తెలిపింది ఇండియన్ బ్యాంక్. వేలం వేయనున్న ఆస్తుల్లో గంటా పేరు మీదున్న విశాఖ నార్త్ నియోజకవర్గంలోని ప్లాట్ ఉంది.
