ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు : ఆర్డీవో మాధవి

వంగూరు, వెలుగు: పార్లమెంట్  ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అచ్చంపేట ఆర్డీవో మాధవి తెలిపారు. బుధవారం మండలంలోని వెలుమలపల్లి, కొనాపూర్ తండా, రంగపూర్ తండా, జాజాల తండా, చాకలి గుడిసెలు, సొమ్ల తండా, సాయి గుట్ట తండా, కొండారెడ్డిపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆమె  పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ కిరణ్మయి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.