ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే

ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు ఆక్షన్ హోరాహోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజ్‎లు కోట్లు కుమ్మరించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మెగా వేలంలో మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది.

ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:

  • జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్)
  • ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్)
  • జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్)
  • భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్)
  • లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
  • రసిఖ్ సలామ్.. రూ.6. కోట్లు (బౌలర్)
  • కృనాల్ పాండ్యా.. రూ.5.75 కోట్లు (ఆల్ రౌండర్)
  • టిమ్ డేవిడ్.. రూ.3 కోట్లు (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)
  • సుయాష్ శర్మ.. రూ.2.60 కోట్లు (బౌలర్)
  • జాకబ్ బెథెల్.. రూ.2.60 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
  • దేవదత్ పడిక్కల్.. రూ.2 కోట్లు (బ్యాటర్)    
  • నువాన్ తుషార.. రూ.1.60 కోట్లు (శ్రీలంక, బౌలర్)
  • రొమారియో షెపర్డ్.. రూ.1.50 కోట్లు (వెస్టిండీస్, ఆల్ రౌండర్)
  • స్వప్నిల్ సింగ్.. రూ.50 లక్షలు (ఆల్ రౌండర్)
  • స్వస్తిక్ చికారా.. రూ.30 లక్షలు (బ్యాటర్)    
  • మనోజ్ భాండాగే.. రూ.30 లక్షలు (ఆల్ రౌండర్)
  • మోహిత్ రతీ.. రూ.30 లక్షలు (బౌలర్)
  • అభినందన్ సింగ్.. రూ.30 లక్షలు (బౌలర్)
  • లుంగి ఎంగిడి.. రూ.1 కోటి (దక్షిణాఫ్రికా, బౌలర్)

ఆర్సీబీ రిటైన్ లిస్ట్:

  • విరాట్ కోహ్లీ.. రూ.21 కోట్లు (బ్యాటర్)
  • రజత్ పాటిదార్.. రూ.11 కోట్లు (బ్యాటర్)
  • యశ్ దయాల్.. రూ.5 కోట్లు (బౌలర్)

Also Read :  వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే