కంటి చూపు సరిగ్గాలేని వారు కరెన్సీ నోట్లు గుర్తు పట్టడం చాలా కష్టం. అయితే అలాంటి వారి కోసం ఆర్బీఐ ఓ యాప్ ను విడుదల చేసింది. ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని కరెన్సీ నోట్ పైన స్కాన్ చేస్తే ఏ కరెన్సీ ఎంత అనేది ఇట్టే చెప్పేస్తుంది.
మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైర్ (మని) యాప్ ను ఆర్బీఐ విడుదల చేసింది. 2016 నవంబర్ లో ఆర్బీఐ మహ్మాత్మాగాంధీ సిరీస్ పేరుతో కొత్తనోట్లను విడుదల చేసింది. ఆయితే ఆ నోట్లను గుర్తించడం కష్టంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి.
ఆ ఫిర్యాదులపై స్పందించిన ఆర్బీఐ ఈ యాప్ ను తయారు చేసి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం విడుదల చేశారు. ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ లో అందుబాటులోకి వచ్చింది.
ఈ యాప్ ను వినియోగించేవారు గత 30 రోజుల కరెన్సీ ని గుర్తిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
